Tuesday, January 24, 2006

ముగ్గు యొక్క చరిత్ర~:

క్రింద రాసిన విశేషాలు నాకు తెలిసినవి, అక్కడ ఇక్కడ చదివి, వినినవి మాత్రమే. అవి ఎంత వరకు నిజము అన్నది నెను నిరూపించలేని పరిస్టితి.

ముగ్గు అనేది బియ్యపి పిండితొ ఆడవారు తమ ఇంటి ముందు అలంకరిస్తూ వేసే ఒక రూపకల్పన. ముగ్గు సాదారనంగా అనురూపము (symmetric, సమానత కలిగిన). ప్రతి రఒజు ప్రొద్దుననే ఆడవారు దక్షిన భారత దెశములో ముగ్గుని ఇండ్ల ముందే కాకుండా గుడి ముందు, కొట్టు ముందు, కార్యాలయాల ముందు వేసి సింగారిస్తారు. సూర్యొదయానికి ముందు, వాకిలిని (threshold of the the house) ఊడ్చి (cleaned) సాంపి (cow dung mixed with water, used to wax the floors, has antiseptic properties protecting the house and its members) చల్లి ముగ్గుని వేస్తారు.

ముగ్గు ఎందుకు వేస్తారు అనేదానికి చాలా మంది చాలా కారనాలు చెప్తారు~:

  • ఓకటి ఎమంటే, భారతీయులు సహజ దయా గుణులు కనుక, చీమలకు కష్టము కలగకుండా ఉండటానికి వాటికి ఆహారముగా బియ్యపిండితొ ముగ్గు వెస్తారు. అంతే కాకుండా బియ్యపి పిండి వల్ల చాల పక్షులు, జంతువులు వస్తాయి, దీనివలన మనం సహజనీతి అయిన సర్వసమ్మేలనం ప్రోత్సహిస్తూ, ఇతర జీవాలును, మనుషులు కలిసిమెలిసి బ్రతుకుతుంటాము;
  • ఇంకొక కారణం, ఆడవారు అలంకార ప్రియులు; వారినీ, ఇంటినే కాదు, వాకిలిని కుడా ముస్తాబుచెయ్యుటానికి సిద్దంగా ఉంటారు.
  • మరొక కారనం ఎమంటే, ఆడవారు వంగి ముగ్గు వెయ్యటం వలన వారి సంతానొత్పత్తి వ్యవస్త, కడుపికి సంభందించిన రోగాల నించి దూరంగా ఉండవచు.
  • “అతిధి దెవో భవాః…” అని మాటలలొనే కాదు, చెతలలో కూడా చూపిస్తాము ఈ ముగ్గుతో.

ముగ్గుని పలు ప్రదెశాలలో పలు విదాలుగా పిలుస్తారు. రంగోలి అని చాల ప్రదెశలలో ముఖ్యంగా ఉతర దెశంలో, రంగవల్లి అని కర్నాటకలో, పూకలం అని కేరలలో, చౌకుపురానా అని మధ్యప్రదెశ్లో, మదన అని రజస్తానులో, అరిపన అని బిహార్లో, అల్పన అని బెంగాలులో, కోలం అని తమిలనాడులో, ఇలా పలు రకాలుగా పిలుస్తారు.

మీకు తెలుసా? ముగ్గు మన దక్షిన భారతీయులకే కాదండి, buddhist లకు, paarsi లకు, కుడా తెలుసునట.

ఈ బ్లాగ్ యొక్క ఉద్దేశం/ పరిమిత ప్రయోజనం ~:

మన తెలుగు వాళ్లు ముగ్గు అనే సంస్కృతిని మరిచిపొతున్నారు. నన్నే ఉదాహరనగా తీసుకోండి; చిన్నప్పుడు చాల ముగ్గులు వెసేదాన్ని, పదవ తరగతి వరకు కూడా వెశాను, కాని ఈనాడు ఒక చిన్న ముగ్గు వెయ్యలంటే రాదు. ఎందువలన?

"Busy life took my tradition away from me?" చెప్పాలంటే ఆ ఇంగ్లీషు తనము (some people call it modernization) తొ పాటు, మన సంస్కృతికి దూరంగా, సంస్కృతికి అనే పదానికి అర్థం తెలియని దెశంలో ఉండటం మరో కారణం.

ఈ బ్లాగు ద్వారా ముగ్గుల గురించి నాకు తెలిసినంత చెప్పటం, తద్వారా నెను తెలుసుకోవాలనేది ఒక చిన్న ఆశ. నా తెలుగులో కాని, నెను ప్రచురించే ముగ్గుల గురించి కాని ఎమైనా తప్పు అని మీకు అనిపిస్తే నన్ను సరిదిద్దగలరు. మరి పదండి మొదటి ముగ్గు వేద్దామా?